Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:47 PM
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.

కృష్ణాజిల్లా: ఆడబిడ్డలపై సోషల్ మీడియా (Social Media)లో అనుచిత పోస్టులు (Inappropriate Posts) పెట్టే ఏ ఒక్కరినీ క్షమించమని.. ఆడబిడ్డల సంరక్షణ, సమాజ శ్రేయయ్సే కూటమి ప్రభుత్వ (Kutami Govt.) లక్ష్యమని (Goal) ఏపీ రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister kollu Ravindra) స్పష్టం చేశారు. సినీ రచయిత, నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) అరెస్టు (Arrest)పై స్పందించిన ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. చట్టబద్ధంగానే పోసాని అరెస్ట్ జరిగిందని, గతంలో ఆయన మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలు ఎవరూ మరచిపోరని అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు చిన్నారి నమస్కారం..
అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించం..
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ లోనికి పంపించేవాళ్లమని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలెండర్లు..
వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లని వెంటాడుతున్నాయని, కూటమి పాలనలో ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నామని, పెన్షన్ సొమ్ము పెంచి ఇస్తున్నామని తెలిపారు. దీపం పథకం కింద అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తున్నామని తెలిపారు. మే నెలలో తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లకు నిధులు తెచ్చి పనులు ప్రారంభించామని.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు, పెట్టుబడులు తెస్తున్నామని తెలిపారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్రం అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలవనుందని అన్నారు.
పేర్నినానిపై హాట్ కామెంట్స్...
మాజీ మంత్రి పేర్ని నాని మీద మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. పేర్ని నాని చాలా ప్రెస్టేషన్‌లో ఉన్నారని, తన గోడౌన్ నుండి రేషన్ బియ్యం ఏ రకంగా తరలి వెళ్లిందో, ఎక్కడి నుంచి ఏ లారీ బయల్దేరిందో చెక్‍పోస్ట్ నుంచి ఏ లారీ దాటిందో అన్నీ బయటకు వస్తాయని అన్నారు. కాకినాడ షిప్పుల్లో అక్రమంగా బియ్యం ఎలా రవాణా అయ్యిందో వివరాలన్నీ ఉన్నాయని మంత్రి తెలిపారు. పేర్ని నాని అకౌంట్‍లో డబ్బులు ఏ విధంగా వచ్చాయి.. ఆయన భార్య జయసుధ అకౌంట్‍లో డబ్బులు ఎలా క్రెడిట్ అయ్యాయో ఇలా అన్నీ బయటకు వస్తాయని మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొట్టుకున్న బీజేపీ-కాంగ్రెస్ నాయకులు..
ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News