Home » Madhavi
మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజు భార్య వెంకట మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసిన విషయం తెలిసిందే. భార్య నిత్యం తనను వేధిస్తూ డామినేట్ చేస్తోందని, ప్రతి చిన్న విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి వాళ్లతో తనను చిత్ర హింసలకు గురిచేస్తోందన్నఅక్రోషంతో హత్య చేశాడు.
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చ అయింది. కార్పొరేషన్ వేదికపై మేయరు సురేశ్‌బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి...
కడప కార్పోరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయకపోవడంతో రెండు వర్గాలకు చెందిన నేతలు పోటా పోటీగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కుర్చీ వేసే వరకు సమావేశం జరగకూడదని టీడీపీ పట్టుపడుతుండగా.. మరోవైపు ఎలాగైనా సమావేశం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు.
కడప: నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం వేళ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మేయర్ చాంబర్‌లో కూర్చీ వేయలేదు. ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు, మాధవి రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
కడప కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ నిర్వీర్యం చేసిందని, సచివాలయంలో ఎవరి బాధ్య త ఏమిటో తెలియక పని చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కడప జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా శంకుస్థాపనకే పరిమితం చేశారని ఆమె ఆరోపించారు.
కడపలో లోకల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య చెత్తపై యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .
YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..