Share News

Madhavi Reddy: ప్రతిపక్ష హోదా కోసం జగన్ లేఖ రాయడం సిగ్గుచేటు..: ఎమ్మెల్యే మాధవి రెడ్డి

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:52 PM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Madhavi Reddy:  ప్రతిపక్ష హోదా కోసం జగన్ లేఖ రాయడం సిగ్గుచేటు..: ఎమ్మెల్యే మాధవి రెడ్డి

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) ప్రతిపక్ష హోదా (Opposition Status) కోసం స్పీకర్‌ (Speaker)కు లెటర్(Letter) రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే (Kadapa MLA) ఆర్. మాధవి రెడ్డి (R.Madhavi Reddy) ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్‌కు భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు.


ప్రజల దగ్గరకు వెళ్లి మొఖం చూపించుకోలేక జగన్ రెడ్డి కుయుక్తులకు తెరలేపారని, స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదని మాధవి రెడ్డి విమర్శించారు. ఆరుగురు టీడీపీ శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని జగన్ అన్న మాటలు మరిచిపోయారా? అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయితేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా?.. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ?.. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా?.. అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలన్నారు. జగన్ పాలనలో నష్టపోని వ్యక్తి లేరని, అందుకే సొంత నియోజకవర్గంలో కూడా జగన్ రెడ్డిపై రాళ్లు విసిరారని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు ప్రతిపక్షం అంటూ కొత్తనాటకాలకు తెరలేపారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.


కాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం అసెంబ్లీ పద్దతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు.


ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయాన్ని పరిశీలించండి: జగన్

అధికారకూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని అన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని జగన్ అభ్యర్థించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారు

వారిని నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తా..

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మాజీ వైసీపీ ఎంపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 01:54 PM