Home » Mahabubnagar
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్‌సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
కలప లోడుతో వెళుతున్న ఓ లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. మృతు శకటంలా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. రోడ్డుపక్కన టీ తాగుతున్న వారిపై బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది
ఎక్కడైనా.. ఎవరికైనా.. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంట్ బిల్లు.. వందల్లో.. వేలల్లో వస్తుంది. అదే వాణిజ్య సముదాయం అయితే రూ. లక్షల్లో వస్తుంది.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకోగా మజ్లిస్ ఓ చోట గెలుపొందింది. అయినప్పటికీ ఆయా స్థానాల్లో నోటా ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు లభించడం విశేషం.
లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.
హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.