Home » Malkajgiri
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా.. మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొని తమను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తూ ఉంటారు. అందుకు పంచాయతీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరు.. అందుకు మినహాయింపు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే.
మల్కాజిగిరి నియోజకవర్గంలో వీరశైవలింగాయత్లు తమ మద్దతును బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender)కు ప్రకటించారు. ఈ మేరకు వీరశైవలింగాయత్ సమాజం అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర ప్రసాద్ మల్కాజిగిరిలోని తన నివాసంలో వీరశైవలింగాయత్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితదేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy) అన్నారు.
దేశంలో మరోసారి నరేంద్రమోదీ(Narendra Modi)యే ప్రధాని అవుతారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జేజేనగర్లోని మహాభోది ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తమిళుల ఆత్మీయ సమావేశంలో అయన మాట్లాడారు.
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad) నగరాన్ని బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో నిలిపింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు’ అని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) తెలిపారు.
తమ సిటింగ్ స్థానమని అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యేలంతా తమ వాళ్లేనని బీఆర్ఎస్, ప్రధాని మోదీ ఇమేజ్ కలిసివస్తుందని బీజేపీ.. ఇలా ఎవరికి వారు మల్కాజిగిరిలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
బీజేపీతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని మల్కాజిగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. మంగళవారం మల్కాజిగిరికి చెందిన టీడీపీ నాయకులు, అడ్వకేట్ సుధీర్, ఫోరమ్ ఫర్ బెటర్ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు రాకేష్ తదితరులు ఈటల సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వనించారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.
మల్కాజ్గిరి అభివృద్ధి నా భాద్యత అంటూ ప్రజలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender) హామీనిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇస్తున్నారని, ఆగస్టులో తప్పకుండా రైతు రుణమాపీ చేస్తానంటూ నమ్మబలికిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నానని ఈటల రాజేందర్ అన్నారు.