Share News

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ కథ ముగిసింది..

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:09 AM

బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ కథ ముగిసింది..

  • కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది

  • రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టం

  • ఆంధ్రప్రదేశ్‌ తీర్పు హర్షణీయం: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, ఫలితంగా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైందని, ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత, పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు గెలిచారని చెప్పారు.


గజ్వేల్‌, సిద్దిపేట, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ రూ.వందల కోట్లు పంచిపెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. పదేళ్లలో రూ.పది లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేశామని.. అందువల్లే ప్రజలు ఎనిమిది సీట్లలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. మరో ఆరు చోట్ల రెండో స్థానంలో నిలిచామని, బలమైన ప్రత్యామ్నాయంగా మారామని చెప్పారు. కాంగ్రెస్‌ ఆరు నెలల పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేసినా.. ప్రజలు అర్వింద్‌ను గెలిపించారని చెప్పారు. ఏపీలో ప్రజల తీర్పు హర్షణీయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.


స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు వాటా ఇవ్వాలి: లక్ష్మణ్‌

తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.


కాంగ్రెస్‌ ఓట్లూ మాకే పడ్డాయి: కొండా

ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతో పాటు పలు చోట్ల కాంగ్రెస్‌ ఓట్లు కూడా తమకు పడ్డాయని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌ ఓట్లు మాత్రమే తమకు పడి ఉంటే, తాండూరు, వికారాబాద్‌ వంటి ప్రాంతాల్లో తమకు మెజారిటీ వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు సతమతమవుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విద్యుత్తు కోతలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి తక్షణం రైతుల సమస్యలపై సమీక్షించాలని కోరారు.


చినజీయర్‌ ఆశీస్సులు తీసుకున్న ఈటల

మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఈటల పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామి.. ఈటలకు శాలువా కప్పి మంగళ శాసనములు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jun 07 , 2024 | 04:09 AM