Share News

TG Politics: జవహర్ లాల్ నెహ్రూ ఆ తర్వాత మోదీ రికార్డ్ సృష్టించారు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:35 PM

బీజేపీ ఓటు బ్యాంకు 14శాతం నుంచి 35శాతానికి పెరిగిందని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.తెలంగాణలో బీజేపీకి మాత్రమే భవిష్యత్తు ఉందని ఉద్ఘాటించారు.

TG Politics: జవహర్ లాల్ నెహ్రూ  ఆ తర్వాత మోదీ రికార్డ్ సృష్టించారు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Etala Rajender

హైదరాబాద్: బీజేపీ ఓటు బ్యాంకు 14శాతం నుంచి 35శాతానికి పెరిగిందని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.తెలంగాణలో బీజేపీకి మాత్రమే భవిష్యత్తు ఉందని ఉద్ఘాటించారు.మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ సొంత జిల్లా అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకున్నా ప్రజలు తిరస్కరించారని అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ...లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌కు భంగపాటు తప్పలేదన్నారు.


‘‘రాష్ట్రం నా జాగీరు, నియోజకవర్గం నా జాగీరు అనుకుంటే ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని హెచ్చరించారు. బీజేపీ నుంచి గెలిచిన 8మంది అభ్యర్థులు అనుభవం ఉన్న వ్యక్తులేనని చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీర్చడమే ఎంపీలుగా తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకు ఒత్తిడి తెస్తామని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ తప్ప మూడోసారి ప్రధానిగా మోదీకి అవకాశం దక్కిందని ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, సొంత జిల్లా సీటు కూడా ఓడిపోయారని చెప్పుకొచ్చారు. పేదలకు ఇళ్ల , గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తామని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తేనే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 10:35 PM