Home » Mamata Banerjee
బబూన్ బెనర్జీతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బబూన్‌ను తన సోదరుడిగా పిలవద్దని సూచించారు. కుటుంబ పాలనను తాను నమ్మనని స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీకి చిక్కులు తప్పేట్టు లేవు. హౌరా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రసూన్ బెనర్జీని తిరిగి నామినేట్ చేయడంపై మమతా బెనర్జీ చిన్న తమ్ముడు బాబున్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే హౌరా సీటు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) అమలుపై ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్‌లో భాగమని తూర్పారపట్టారు.
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాజకీయనాయకుడు కానీ, పార్టీ కానీ ఆమెను విశ్వసించలేరనే విషయాన్ని మమతా బెనర్జీ నిరూపించుకున్నారని అన్నారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు.
సీఎం మమత బెనర్జీ తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు రోజుగా ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్ ఖాలీలో ఇటీవల జరుగుతున్న ఉదంతాలను తూర్పారబడుతూ ప్రధాని మోదీ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మోదీకి కౌంటర్‌గా దీదీ గురువారం మహిళా మద్దతుదారులకు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఎంసీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తలో నిలిచిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.
Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్‌కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలు, వారి అసిస్టెంట్ల జీతాలు పెంచుతున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే మమతాబెనర్జీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.