Share News

Adhir Ranjan: పీఎంఓకు దాసోహమైన దీదీ... అధీర్ రంజన్ ఫైర్

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:49 PM

పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాజకీయనాయకుడు కానీ, పార్టీ కానీ ఆమెను విశ్వసించలేరనే విషయాన్ని మమతా బెనర్జీ నిరూపించుకున్నారని అన్నారు.

Adhir Ranjan: పీఎంఓకు దాసోహమైన దీదీ... అధీర్ రంజన్ ఫైర్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal) నుంచి లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) పోటీచేసే 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాజకీయనాయకుడు కానీ, పార్టీ కానీ ఆమెను విశ్వసించలేరనే విషయాన్ని మమతా బెనర్జీ (Mamata Banerjee) నిరూపించుకున్నారని అన్నారు. జాబితా ప్రకటనతో తాను 'ఇండియా' కూటమితో లేననే స్పష్టమైన సంకేతాలను పీఎంఓ కార్యాలయానికి పంపారని వ్యాఖ్యానించారు. టీఎంసీ అభ్యర్థుల జాబితాలో అధీర్ రంజన్ నియోజకవర్గమైన బహరాంపూర్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను ప్రకటించడంపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.


''యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలని మమతా బెనర్జీ కానీ, టీఎంసీ కానీ అనుకుంటే ఆయనను రాజ్యసభకు పంపించి ఉండవచ్చు. యూసుఫ్ పఠాన్‌ను గుజరాత్ నుంచి సీటు ఇమ్మని కోరవచ్చు'' అని అధీర్ రంజన్ అన్నారు. 'ఇండియా' కూటమితో ఉంటే ప్రధాన మంత్రి మోదీ ఇంటింటికీ ఈడీ, సీబీఐని పంపుతారనే భయం మమతను పట్టుకుందని ఆరోపించారు. తన పట్ల ఎలాంటి అసంతృప్తి వద్దని, తాను బీజేపీ కూటమికి వ్యతిరేకం కాదని పీఎంఓ కార్యాలయానికి మమతా బెనర్జీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తప్పుపట్టారు.

Updated Date - Mar 10 , 2024 | 06:49 PM