Share News

Sri Rama Navami: శ్రీరామ నవమికి తొలిసారిగా హాలిడే ప్రకటించిన సీఎం..ఎన్నికల కోసమేనా?

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:34 AM

సీఎం మమత బెనర్జీ తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు రోజుగా ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Sri Rama Navami: శ్రీరామ నవమికి తొలిసారిగా హాలిడే ప్రకటించిన సీఎం..ఎన్నికల కోసమేనా?

లోక్‌సభ 2024(loksabha elections 2024) ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ(mamata banerjee) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా ఏప్రిల్ 17న ప్రభుత్వ సెలవు దినంగా(public holiday) ప్రకటించింది. అయితే 2011లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ ప్రభుత్వం మొదటిసారిగా రామనవమి రోజు సెలవు దినంగా ప్రకటించడం విశేషం. మమత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో అవసరమైన సేవలు మినహా కార్యాలయాలు, అనుబంధ సంస్థలు, ఇతర కార్యాలయాలు ఏప్రిల్ 17న మూసివేయబడతాయి.

అయితే గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో(west bengal) శ్రీరామనవమి ఊరేగింపులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. 2023లో రామనవమి ఊరేగింపునకు సంబంధించి మూడు చోట్ల హింస చెలరేగింది. దీంతో కలకత్తా(kolkata) హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దీనిపై దర్యాప్తు చేస్తోంది. ఆ క్రమంలో శ్రీరామ నవమికి ముఖ్యమంత్రి సెలవు ప్రకటించలేదని విమర్శలు కూడా వచ్చాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rail Roko: నేడు రైల్ రోకో ఉద్యమం.. ఈ ప్రాంతాల్లో ట్రైన్స్ బంద్?


ఈ నిర్ణయం పట్ల అక్కడి బీజేపీ నేతలు స్పందించారు. 'జై శ్రీరామ్(jai sriram)' నినాదాలు విన్న ప్రతిసారీ కోపంతో ఊగిపోయే సీఎం మమత(mamata), చివరకు రాష్ట్రంలో శ్రీరామనవమిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారని బీజేపీ ఐటి సెల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ పార్టీ కేంద్ర పరిశీలకుడు అమిత్ మాల్వియా(amit malviya) అన్నారు. ఈ క్రమంలో మమత తన హిందూ వ్యతిరేక ఇమేజ్‌ని పెంచుకోవడానికే ఇలా చేశారని అన్నారు.

ఇది చాలా ఆలస్యం అయినప్పటికీ ప్రధానంగా వచ్చే శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ల దాడి(attack) జరగకుండా చూసుకోవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల(loksabha elections 2024) కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొంత మంది బీజేపీ నేతలు(bjp leaders) అంటున్నారు. హిందూ పండుగలపై మమతకు అంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - Mar 10 , 2024 | 09:37 AM