Home » Mancherial district
క్రైం రేటును తగ్గించే విధంగా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీని వాస్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
తెలంగాణ సా యుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురు వారం చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్‌కు అందజేశారు.
మండల కేంద్రంలోని రైతు వేది కలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకుల శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యం కార ణంగా అన్నదాతకు నష్టం వాటిల్లగా ప్రభుత్వపరంగా సాయం అందించ డంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట నీటి పాలుకావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట మొలక దశలోనే నీట మునగడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి.
గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కాసిపేట పీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, రోగులకు అం దిస్తున్న సేవలను తెలుసుకున్నారు. జ్వరపీడిత గ్రామాల ను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచిం చారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బెది రింపు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.
ఎన్నికల సమయంలో తనను చంపేందుకు సుపారీ ఇచ్చి మనుషులను తెప్పించారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారంటూ ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయ న నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిం చారు.
రైతులు రసాయన ఎరువులను పంటల్లో కుమ్మరిస్తున్నారు. అవసరానికి మించి ఎరువులను వాడుతున్నారు. అధిక వినియోగంతో జిల్లా నేలల్లో భాస్వరం, పొటాష్ నిల్వలు పేరుకపోయాయి. విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో కొన్ని నేలల్లో పోషకాలు ఎక్కువగా, మిగతా చోట్ల తక్కువగా ఉన్నాయి.
చెన్నూరు పట్టణం ఆస్నాద్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కుమ్మరికుంట చెరువు సర్వేను సోమ వారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తగా సర్వే ప్రారంభించారు. సర్వే ప్రారంభంతో కుమ్మరికుంట బఫర్ జోన్లో నిర్మించుకున్న ఇంటి నిర్మాణదారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.