సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్ధానంలో నిలపాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:01 PM
సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్ధానంలో నిలపాలని జిల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీలపై డీఈవో యాదయ్య, ఒలింపిక్ కార్యదర్శి రఘునాధ్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్ధానంలో నిలపాలని జిల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీలపై డీఈవో యాదయ్య, ఒలింపిక్ కార్యదర్శి రఘునాధ్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.
రాజ్‌వీరు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సీఎం కప్ 2024లో భాగంగా ఈ నెల 7,8 తేదీల్లో గ్రామస్థాయి,10 నుంచి 12 వరకు మండల, 16 నుంచి 21 వరకు జిల్లా స్ధాయిలో ప్రతిభ కనబర్చిన వారికి డిసెంబరు 27 నుంచి జనవరి 2 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఆసక్తి గల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒలింపిక్ వైస్ ప్రెసిడెంట్ రమేష్, కబడ్డీ కార్యదర్శి రాంచందర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు, పీడీలు, అధికారులు పాల్గొన్నారు.