Share News

రూ.10 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:06 PM

పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లతో ప్రణాళి కలు తయారు చేశామన్నారు.

రూ.10 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు

చెన్నూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లతో ప్రణాళి కలు తయారు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. సీఎం రేవం త్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.300 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. రూ. 2 లక్షల రైతు రణమాఫీ చేసిన ఘనత కాం గ్రెస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ, వైస్‌చైర్మన్‌ నవాజుద్దీన్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

జైపూర్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. టేకమట్లలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యా ర్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు.

టేకుమట్లలో నవంబరు నెలలో ఎస్టీపీపీ రైల్వే ట్రాక్‌ గుంతలో పడి మృతిచెందిన రాజ్‌కుమార్‌ కుటుంబానికి రూ. 15 లక్షల పరిహారం చెక్కును ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, కలెక్టర్‌ కుమార్‌దీపక్‌లు అందజేశారు.

కోటపల్లి, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామా ల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. అర్జునగుట్ట, రాపన్‌పల్లి, దేవులవాడ, రాంపూర్‌, పారుపెల్లి, రొయ్యల పల్లి, ఆల్గామ, జనగామ గ్రామాల్లో డీఎంఎఫ్‌టీ నిధులతో సీసీ రోడ్ల పనులు, డ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశారు. ప్రధాన రహదా రుల్లో బ్రిడ్జీలు, కల్వర్టులు, అంతర్గత రహదారుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మణ్‌గౌడ్‌, సంతోష్‌, మాజీ ఎంపీపీ వెంకట స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కల్పన, తహ సీల్దార్‌ సదానందం, రాజన్న, రాజ్‌కుమార్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 11:06 PM