Home » Mancherial district
జైపూర్ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై శుక్రవారం కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్టర్ పీఏసీఎస్ చెన్నూరు ఫీల్డ్ అధికారి రవికిశోర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
జనవిజ్ఞాన వేదిక చెకుముఖి సైన్స్ సంబురాలు-2024ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సైన్స్ సంబరాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
సింగరేణి కార్మికులకు దీపావళి (పీఎల్ఆర్) బోనస్ ఈ నెల 25న బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ మేరకు రూ.358 కోట్లు యాజమాన్యం చెల్లించేందుకు ప్రకటించింది. గత నెల 29న ఢిల్లీలో జరిగిన పీఎల్ఆర్ బోనస్ చర్చల్లో కార్మికు లకు దీపావళి బోనస్‌ను యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బెటాలియన్ పోలీసుల సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్ ఎదుట గురువారం పోలీసుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
పోలీ సు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని డీసీపీ భాస్కర్‌రావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించు కుని గురువారం ఎస్టీపీపీ పీహెచ్సీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సిబ్బంది ప్రజాప్రతినిధులు, యువకులు సుమారు 250 మంది రక్తదానం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం పీహెచ్సీ కేంద్రాన్ని సందర్శించి రిజిష్టర్లు, ఆసుపత్రి పరిసరాలు, మందుల నిల్వ లు, రికార్డులను పరిశీలించారు.
ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని డీపీవో వెంకటేశ్వర్రావు అన్నారు. గురువా రం కన్నాల పంచాయతీ పరిధిలోని తిరుమల హిల్స్‌లో ఆయన పర్యటిం చారు. గడువులోగా దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని కార్యదర్శులకు సూచించారు.
ఆర్వోఆర్-2024 కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపావళికి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, చట్టానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి.
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్-విజయవాడ వరకు తలపెట్టిన రహదారి నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం టేకుమట్ల, ఎల్కంటి, శెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్,వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును తెలుసుకున్నారు.
ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలని, రక్తధానం ప్రాణధానంతో సమానమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తధాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.