ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:07 PM
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం పీహెచ్‌సీ కేంద్రాన్ని సందర్శించి రిజిష్టర్‌లు, ఆసుపత్రి పరిసరాలు, మందుల నిల్వ లు, రికార్డులను పరిశీలించారు.
హాజీపూర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం పీహెచ్‌సీ కేంద్రాన్ని సందర్శించి రిజిష్టర్‌లు, ఆసుపత్రి పరిసరాలు, మందుల నిల్వ లు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. సబ్బేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హాజరు పట్టిక, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేంపల్లి గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ముల్కల్ల పంచాయతీలోని కంపో స్టు షెడ్‌ను సందర్శించి గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టుషెడ్‌కు తరలించి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని సూచించారు. ఎంపీడీవో ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల ఆవరణ లో చేపట్టిన సెంట్రల్ డ్రగ్ స్టోర్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం పనుల ను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లడుతూ పనులను వేగవం తం చేయాలని సూచించారు. జిల్లా పరిధిలో మందుల పంపిణీకి
విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి
మంచిర్యాల కలెక్టరేట్, (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవి ష్యత్‌పై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీలు రవికుమార్, వెంక టేశ్వర్, జిల్లా అబ్కారీ మద్యనిషేధ అధికారి నందగోపాల్ తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పాఠశా లలలో ప్రహరీ క్లబ్స్ నిర్వహించాలని, ప్రతీ నెల 3వ బుధ వారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థలకు వం ద మీటర్లలో పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల విక్ర యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో యాదయ్య, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, వ్యవసాయాధికారి కల్పన, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ చందన పాల్గొన్నారు.