భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2024 | 10:46 PM
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్-విజయవాడ వరకు తలపెట్టిన రహదారి నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం టేకుమట్ల, ఎల్కంటి, శెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్,వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును తెలుసుకున్నారు.
జైపూర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్-విజయవాడ వరకు తలపెట్టిన రహదారి నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం టేకుమట్ల, ఎల్కంటి, శెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్,వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల-విజయవాడ జాతీయ రహదారి 334 కిలోమీటర్ల మేర ఉంటుందని జిల్లా పరిధిలో 110 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 83 హెక్టార్ల భూమి ప్రభుత్వానికి అప్పగించామన్నారు. రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రహదారి నిర్మాణంలో భాగంగా సేకరణ జరుగుతున్న భూముల సంబంధిత అంశాలపై అధికారులు భూ యాజమానులు రైతుల సమస్వయంతో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
రిజిష్టర్లలో సేవల వివరాలు నమోదు చేయాలి
జిల్లాలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలను రిజిష్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, వైద్యాధికారి కృపాబాయి, ప్రోగ్రాం అధికారి ఫయాజ్‌తో కలిసి ఆశా కార్యకర్తలకు రిజిష్టర్లను అందజేశారు. కలెక్టర్ మాట్లాడఉతూ జిల్లాలో 651 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారని, వీరికి 3,515 రిజిష్టర్లను అందించామని, రిజిష్టర్లలో17 రకాల వైద్య సేవల గురించి వివరంగా ఇవ్వడం జరిగిందన్నారు. వైద్యాధికారులు అనిల్, వెంకటేశ్వర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.