Home » Manipur
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
రెండు నెలలకు పైగా హింసాకాండతో విలవిల్లాడుతున్న మణిపూర్‌లో త్వరలోనే యథాపూర్వ పరిస్థితిలు నెలకొంటాయని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తెలిపారు. సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. మణిపూర్ ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్ 267పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.
మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.
దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను విడుదల చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగించి, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని ఆయనకు బాగా తెలుసునని, అందుకే ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు.
మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు.
ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.