Manipur : మణిపూర్ గిరిజన తెగల హెచ్చరిక.. మూడు రోజులే గడువు..

ABN , First Publish Date - 2023-08-17T15:29:47+05:30 IST

మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు అందకుండా ఇంఫాల్ లోయ ప్రాంతాలవారు అడ్డుకుంటున్నారని గిరిజన ఐక్యత కమిటీ (CoTU) ఆరోపించింది. ఈ పరిస్థితిని మూడు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపరచకపోతే, రెండు ప్రధాన జాతీయ రహదారులను తాము దిగ్బంధనం చేస్తామని హెచ్చరించింది.

Manipur : మణిపూర్ గిరిజన తెగల హెచ్చరిక.. మూడు రోజులే గడువు..

ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు అందకుండా ఇంఫాల్ లోయ ప్రాంతాలవారు అడ్డుకుంటున్నారని గిరిజన ఐక్యత కమిటీ (CoTU) ఆరోపించింది. ఈ పరిస్థితిని మూడు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపరచకపోతే, రెండు ప్రధాన జాతీయ రహదారులను తాము దిగ్బంధనం చేస్తామని హెచ్చరించింది. మణిపూర్-నాగాలాండ్‌లను కలుపుతున్న ఎన్‌హెచ్2ను, మణిపూర్-అస్సాంలను కలుపుతున్న ఎన్‌హెచ్37ను దిగ్బంధనం చేస్తామని వివరించింది.

మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు మే 3 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 3,000 మంది గాయపడ్డారు. సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్‌హెచ్2ను ఇప్పటికే రెండుసార్లు దిగ్బంధనం చేశారు. మే నెలాఖరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించి, సంబంధిత వర్గాలతో మాట్లాడారు. రోడ్ల దిగ్బంధనాలను ఉపసంహరించుకోవాలని సీఓటీయూ వంటి సంఘాలను కోరారు. అమిత్ షా మాటను మన్నించి, ఈ సంఘాలు రోడ్ల దిగ్బంధనాలను ఉపసంహరించుకున్నాయి.

సీఓటీయూ మీడియా సెల్ సమన్వయకర్త ఎన్గ్. లున్ కిప్జెన్ మాట్లాడుతూ, ఇంఫాల్ లోయ ప్రజలు కూడా తాము ప్రదర్శించిన సౌహార్దతను ప్రదర్శిస్తారని ఆశించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జాతీయ రహదారులను తెరవడానికి సంబంధించిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన గ్రూపులు, భారత ప్రభుత్వం ఆ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోవడం లేదని తెలిపారు.

ఇంఫాల్ లోయ నుంచి కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకుల సరఫరాను అడ్డుకుంటున్నారన్నారు. ముఖ్యంగా కాంగ్పొక్పి, చురాచాంద్‌పూర్, టెంగ్నౌపాల్, మోరేహ్ ప్రాంతాలకు సరుకులను అడ్డుకుంటున్నారని చెప్పారు. ఒక తెగపైన మరో తెగకుగల కోపాన్ని శాంతింపజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించవలసి ఉందన్నారు. నచ్చిన రోడ్లను దిగ్బంధనం చేయడాన్ని భారత ప్రభుత్వం నిరోధించకపోతే, జాతీయ రహదారులను దిగ్బంధనం చేయవలసిన తప్పనిసరి పరిస్థితి ప్రజలకు వస్తుందని హెచ్చరించారు. ఆగస్టు 17 నుంచి మూడు రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి :

Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..

Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?

Updated Date - 2023-08-17T15:29:47+05:30 IST