Home » Maoist Encounter
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్‌కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
Telangana: ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్కౌంటర్లు అని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.