Share News

Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 800 పోలీసులతో కలిసి..

ABN , Publish Date - May 23 , 2024 | 03:26 PM

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 800 పోలీసులతో కలిసి..
Encounter in Chhattisgarh

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 800 మంది పోలీస్ బలగాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులను పట్టుకునేందుకు భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది.


మావోల కోసం డిప్యూటీ సీఎం లేఖ..

ఇదిలాఉంటే.. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ శర్మ నూతన ప్రయత్నం చేస్తున్నారు. గురువారం ఉదయం విజయ శర్మ నక్సలైట్లకు బహిరంగ పిలుపునిస్తూ లేఖ రాశారు. నక్సల్ పునరావాస విధానంలో మార్పు కోసం నక్సలైట్‌ల నుండి ప్రభుత్వం సూచనలు కోరింది. ప్రభుత్వం ముందు లొంగిపోయే నక్సలైట్లు తమ వివరాలు తెలిపేందుకు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఈమెయిల్ ఐడీ, గూగుల్ ఫామ్‌ను విడుదల చేశారు. నక్సల్స్ నుంచి సూచనలు కోరుతూ ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తులను స్వీకరిస్తోంది. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతోంది.

For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 03:26 PM