Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 80కి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాం..
ABN , Publish Date - Apr 17 , 2024 | 05:42 PM
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్‌లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కాంకెర్‌లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద (anti-Maoist operations) 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నక్సలిజం, టెర్రరిజానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిరంతర ప్రచారం సాగిస్తూ వచ్చిందని, 2014 నుంచి శిబిరాలను ఏర్పాటు చేస్తూ వచ్చామని చెప్పారు.
Encounter: 29 మంది నక్సల్స్ మృతి.. మావోయిస్టు చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్..!
''2019లో ఛత్తీస్‌గఢ్‌లో కనీసం 250 క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. మూడు నెలల కాలంలోనే ఆ రాష్ట్రంలో 80 మంది మావోయిస్టులు హతమయ్యారు. 125కు పైగా అరెస్టులు జరిగాయి. 150 మందికి పైగా నక్సలైట్లు లొంగిపాయారు" అని అమిత్‌షా తెలిపారు. ప్రభుత్వ అఫెన్సివ్ పాలసీ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో చిన్న ప్రాంతానికి మాత్రమే మావోయిస్టులు పరిమితమయ్యారని, త్వరలోనే నక్సల్స్ రహిత ఛత్తీస్‌గఢ్, నకల్స్ రహిత భారతదేశాన్ని చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత బస్తర్ లోక్‌సభ స్థానంలో ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా, బస్తర్ ప్రాంతంలోని కాంకెర్ నియోజవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది.
జాతీయ వార్తలు కోసం..