Home » Medak
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
జైలుశిక్ష పడినంత మాత్రాన ఖైదీలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరని హైకోర్టు స్పష్టం చేసింది. జైల్లో హత్యకు గురైన ఖైదీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓ హత్య కేసులో 2012 నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మెదక్ జిల్లా టేక్మల్ మండలం కౌసంగి గ్రామానికి చెందిన కరోళ్ల వెంకయ్య.. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.
దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.
Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి బరిలోకి దిగారు.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.