Share News

Medak: మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త దేవేందర్‌రెడ్డిపై వేటు

ABN , Publish Date - May 26 , 2024 | 06:07 AM

మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించాలని డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. మెదక్‌ జిల్లాలోని రామాయంపేట మండలం కోనాపూర్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

Medak: మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త దేవేందర్‌రెడ్డిపై వేటు

  • డీసీసీబీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించాలని తీర్మానం

మెదక్‌, మే 25: మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించాలని డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. మెదక్‌ జిల్లాలోని రామాయంపేట మండలం కోనాపూర్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. సొసైటీ బైలా ప్రకారం 15రోజు ల పాటు విధులకు హాజరు కాకపోతే చైర్మన్‌ స్థానంలో వైస్‌ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగిస్తారు.


ఈ మేరకు వైస్‌ చైర్‌పర్సన్‌ కరికి విజయలక్ష్మిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ జిల్లా సహకార శాఖ అధికారి 2022లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దేవేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఇచ్చింది. అయితే, దేవేందర్‌ రెడ్డిని చైర్మన్‌గా తొలగించాలని ఈ ఏడాది మార్చిలో కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయని జిల్లా సహకార శాఖాధికారి కరుణ తెలిపారు. కో ఆపరేటివ్‌ చట్టం(51) ప్రకారం దుర్వినియోగానికి గురైన సొమ్మును రికవరీ చేయల్సి ఉందన్నారు. ఈ మేరకు దేవేందర్‌ రెడ్డికి నోటీసులు జారీ చేయగా, సమాధానం ఇవ్వలేదని తెలిపారు. దీంతో శుక్రవారం జరిగిన డీసీసీబీ సమావేశంలో ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారన్నారు. ఆ తీర్మానాన్ని అమలు చేస్తూనే, ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని దేవేందర్‌రెడ్డికి నోటీసు జారీ చేశామన్నారు.

Updated Date - May 26 , 2024 | 06:07 AM