Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్
ABN , Publish Date - May 11 , 2024 | 01:43 PM
Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..
సంగారెడ్డి జిల్లా, మే 11: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం పటాన్‌చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని.. తమకు ఓట్లు వేయాలని బీజేపీ (BJP) వాళ్ళు చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని.. కానీ గొడవలు జరిగితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు.
AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను తీసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ దేశ ప్రధాని అయ్యారని.. ఈ ప్రాంతంను ఎంతో అభివృద్ధి చేసింది ఇందిరా గాంధీ అని తెలిపారు. ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన పనులు జరగాలంటే నీలం మధును గెలిపించాలని కోరారు. గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఎంపీలుగా ఉన్నారని.. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. మల్లన్నసాగర్‌లో భూముల కోసం పేదవారిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!
Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..
Read Latest Telangana News And Telugu News