Home » Mega DSC
టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్, డీఎస్పీకి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లో టెట్ తర్వాత 90 రోజుల్లో డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా మెగా డిఎస్సీ అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తెలిపారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదామన్నారు. పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్పై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిసిరింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.
Telangana DSC Notification 2024: తెలంగాణలో(Telangana) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేంది. గత ప్రభుత్వం వేసిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా..
మెగా డిస్సీకి నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్వయంగా సీఎం రేవంత్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం 5,089 ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషన్ను రేవంత్ సర్కారు రద్దు చేసి,
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.