Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:31 PM
Good News To Youth: టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

అమరావతి, మార్చి 29: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేళ రాష్ట్రంలో యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభవార్త చెప్పారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీపై (Mega DSC) సీఎం కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే మేలో తల్లికి వందనం పథకం అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. అంతేకాకుండా రేపు మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి - బంగారు కుటుంబం తీసుకొస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలి.. ఆ సంపద పేదలకు చేరాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు పిల్లలకు తక్కువ కాకుండా కనాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని... ఎన్టీఆర్ వంటి వ్యక్తి మళ్లీ పుట్టరన్నారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని తెలిపారు. పార్టీకి మనమంతా వారసులమని.. పెత్తందారులం కాదన్నారు. ‘నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని.. టీమ్ లీడర్‌ను మాత్రమే. నా చుట్టూ తిరిగితే పదవులు రావు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులని అన్నారు. డీపీని లేకుండా చేయాలని చాలా మంది చూశారని.. టీడీపీని నాశనం చేయాలనుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. పార్టీని స్థాపించిన ముహూర్త బలం చాలా గొప్పదని తెలిపారు.తెలుగువారు ఉన్నంత రకు టీడీపీ ఉంటుందని వెల్లడించారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా టీడీపీ అని అన్నారు.
Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
అన్ని వర్గాలకు టీడీపీ న్యాయం చేస్తుందని చెప్పారు. బీసీలంటే సమాజానికి వెన్నెముక అని గుర్తించిన పార్టీ టీడీపీ అని.. పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ టీడీపీ అని.. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు వస్తాయని అన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చి వెళ్లారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఆలోచించామని.. రాష్ట్రం కోసం జనసేన, బీజేపీతో జతకట్టామని తెలిపారు. 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో అద్భుత విజయం సాధించామని.. నాడు టీడీపీ చేసిన పనులతో ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే అని చెప్పుకొచ్చారు. 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు.
టీడీపీలో కార్యకర్తలే ఫస్ట్.. తర్వాతే నాయకులన్నారు. మంచికి మంచిగా ఉంటా.. లేదంటే తాట తీస్తానని హెచ్చరించారు. ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిందే అని అన్నారు. పార్టీలో కొత్తవాళ్లు, పాతవాళ్లు కలిసి పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే పార్టీకి ఓటమి ఉండదన్నారు. కార్యకర్తల్లో జోష్ తగ్గినప్పుడే ఇతర పార్టీలకు కొమ్ములొస్తాయన్నారు. తన జీవితంలో ఓటమిని అంగీకరించనని.. ఏపీని అభివృద్ధి చేసి నెంబర్ 1గా నిలబెడతానని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తనదన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
TDP: తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం
Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
Read Latest AP News And Telugu News