Home » MIM
తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయా!? ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయా!? రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోనుందా!? ఈ ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ‘ఔను’ అనే అంటున్నాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు
హైదరాబాద్(hyderabad) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రెండు, మూడు రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7గంటల నుంచే పార్టీల నాయకులు బస్తీలు, కాలనీల మీద ప్రచార దాడిని సాగిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల కల్లా కార్యకర్తలను పార్టీ కార్యాలయాలకు రప్పించి టిఫిన్లు పెట్టించి జెండాలను పట్టించి రంగంలోకి దింపుతున్నారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.