MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:02 AM
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీలు తమతమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించాయి. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అలాగే.. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

- ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి
- బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ(MIM, BJP) పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు(Dr. N. Gautam Rao)లు శుక్రవారం తమ తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధి నుంచి 81 మంది కార్పొరేటర్‌లతో పాటు 29 ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 112మంది ఓటర్లున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Train: రైలులో బాలికపై అఘాయిత్యం..
కార్పొరేటర్ నుంచి..
2019లో మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి ఎమ్మెల్యేల కోటా నుంచి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం గత మార్చి29న ముగిసింది. కాగా ఆయనను జీహెచ్‌ఎంసీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా మజ్లిస్ మరోసారి ఖరారు చేయడం గమనార్హం. 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన మొదటిసారి నూర్‌ఖాన్‌బజార్ డివిజన్ కార్పొరేటర్‌గా, రెండవసారి 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సన్నిహితునిగా, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేయడంతో పాటు షియా వర్గం నాయకులు సిఫారసు చేయడంతో మజ్లిస్ మళ్లీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండిని శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్ధిగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఏబీవీపీ నుంచి గౌతమ్‌రావు ప్రస్థానం..
ఉన్నత విద్యావంతుడు, విజ్ఞాన భారతి విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్. గౌతమ్‌రావుకు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పించింది. ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీలో విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. గడచిన 15 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా ఇటీవలి వరకు పనిచేశారు. ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఈ ఎన్నికపై దృష్టి సారించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News