Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:21 PM
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్ సందర్బంగా అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
యూపీ తరహాలో తెలంగాణలో కూడా జమ్మికి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసద్దుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో వయొలెన్స్ సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ‘అసదుద్దీన్ ఒవైసీ మెంటల్ అయిపోయిండు.. రేవంత్ రెడ్డి గారు మీ కొత్త దోస్తులకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపియండి’ అని రాజాసింగ్ సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Raghunandan Rao: మా సిఫారసు లేఖలు తీసుకోవాలి
High Court: నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
Hyderabad: మోసాలకు కలరింగ్.. నకిలీ యాప్‌లు, స్కీములకు సెలబ్రిటీల ప్రచారం
Read Latest Telangana News and Telugu News