Home » Miryalguda
అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీకి మాజీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారి మిర్యాలగూడలో ఆదివారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రైతు కుటుంబానికి రెండెకరాల పోడు భూమే జీవనాధారం. ఆరేళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్నాడు. ఇటీవల ఆ భూమి తమ పరిధిలోకి వస్తుందంటూ అటవీ అధికారులు చెప్పడంతో.. ఆ రైతు గుండె ఆగినంతపనైంది. తన కుటుంబానికి దిక్కుగా ఉన్న ఆ భూమిని తీసుకుంటే.. తాను బతకలేనని, ఉరేసుకుంటానని చెప్పిన ఆ రైతు అన్నంత పని చేశాడు.
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, అవివాహితుడైన ఓ యువకుడు నెరిపిన బంధం.. వివాదాలు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
డోర్నకల్ జంక్షన్ నుంచి మిర్యాలగూడ వరకు నేలకొండపల్లి మీదుగా చేపట్టనున్న కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ నుంచి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను
పేదలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధిని (సీఎంఆర్‌ఎఫ్) దొంగలేమేసేస్తున్నారు. ఫేక్ బిల్లులకు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులను కొట్టేస్తున్నారు.