Share News

Miryalaguda: మాజీ ఎమ్మెల్యే చేతికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు!

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:04 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీకి మాజీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశమైంది.

Miryalaguda: మాజీ ఎమ్మెల్యే చేతికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు!

మిర్యాలగూడ, ఆగస్టు 5: బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీకి మాజీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా రూ. 13.76 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను 44 మంది లబ్ధిదారులకు మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు అందజేయనున్నట్లు ఆ పార్టీ నేతలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వద్దకు 515 చెక్కులు రావల్సి ఉండగా, 471 చెక్కులు అందాయి.


స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా చెక్కులు బీఆర్‌ఎస్‌ నేతలకు అందడంపై ఎవరి ప్రమేయం ఉందన్న విషయమై అధికార పార్టీ నేతలు అంతర్గత విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావును వివరణ కోరగా... ఎమ్మెల్సీ కోటాలో మంజూరైన చెక్కులుగా బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయని, వాటిని పార్టీ కార్యాలయంలో కాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి దృష్టికి తెచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 03:04 AM