Home » MP Vijaysai Reddy
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టానుసారంగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబును కోరారు.
పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో గత జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన రోత పత్రిక ‘సాక్షి’కి రూ.వందల కోట్లు దోచిపెట్టారు.
అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డిపై ఎల్వోసీ ఇచ్చింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?