Share News

Vijayasai Reddy : ఆ రోజు ఏం జరిగిందంటే

ABN , Publish Date - Jan 26 , 2025 | 03:33 AM

’వివేకానందరెడ్డి మరణించిన రోజు నాకు ఒక విలేకరి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను.

Vijayasai Reddy : ఆ రోజు ఏం జరిగిందంటే

  • వైఎస్‌ వివేకాది గుండెపోటు అని...

  • పులివెందుల నుంచే నాకు సమాచారం

  • అవినాశ్‌ అప్పుడు అక్కడే ఉన్నారు: సాయిరెడ్డి

  • మీడియాకు తెలిపిన విజయసాయి

న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిది గుండెపోటు మరణమని తనకు అందిన సమాచారాన్నే మీడియాకు తెలిపాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయమై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ’వివేకానందరెడ్డి మరణించిన రోజు నాకు ఒక విలేకరి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వివేకానంద చనిపోవడమేంటి? గుండెపోటు ఏంటి? అయన సన్నగా, చాలా హెల్తీగా ఉంటారే?’ అని అన్నాను. వెంటనే పులివెందులకు ఫోన్‌చేసి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అడిగాను. పక్కన ఉన్న ఎవరికో అవినాశ్‌ ఫోన్‌ ఇచ్చారు. ఫోన్‌లో ఆ వ్యక్తి వైఎస్‌ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పాడు. ఫోన్‌లో నాకు వచ్చిన ఆ సమాచారాన్నే నేను విలేకరులకు చెప్పాను’’ అని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 26 , 2025 | 03:33 AM