Home » Nalgonda
Telangana: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: ‘‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్... దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నల్గొండ ఎంపీ అభ్యర్థిని..
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..
Telangana:బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడి పోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ ఓటేయాలని.. రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు.
జనగామ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్నారు. జనగామ, దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.
నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.