Share News

Komatireddy: నీకు సుఖేందర్ చాలు... జగదీష్‌రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:55 PM

Telangana: బీఆర్ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Komatireddy: నీకు సుఖేందర్ చాలు... జగదీష్‌రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్

నల్గొండ, ఏప్రిల్ 23: బీఆర్ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి (Former Minister Jagadish Reddy), కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komati reddy Brothers) మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... మూడు సార్లు మూడు నాలుగు వేలతో గెలిచినాయాన లీడర్ కాదని అన్నారు.

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?


మిర్యాలగూడలో మందు అమ్మిన కేసు ఇప్పటికీ ఉందని.. మూడు మర్డర్ కేసులో ఉన్నారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి జగదీష్ రెడ్డి మరోసారి మాట్లాడితే దెబ్బలు తింటారని హెచ్చరించారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు.... మోకాళ్ళ యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్ రాదంటూ వ్యాఖ్యలు చేశారు. తన స్థాయికి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం ఇదే చివరిసారి అంటూ జగదీష్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి సుఖేందర్ రెడ్డి చాలన్నారు. నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌గా పనికిరారని విమర్శించారు. నల్గొండ అభ్యర్థి వాళ్ల సొంత ఊర్లో సర్పంచ్‌గా కూడా గెలవలేరన్నారు.


ఇవి కూడా చదవండి...

Delhi Liquor Scam: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?


Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 04:59 PM