Komatireddy: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముంది.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు
ABN , Publish Date - Apr 18 , 2024 | 04:52 PM
Telangana: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముందని.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు అని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగొడులో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
నల్గొండ, ఏప్రిల్ 18: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముందని.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు అని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Congress MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. గురువారం మునుగొడులో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను బీఆర్‌ఎస్ పదేళ్ళు పాలించి అప్పుల రాష్ట్రంగా చేశారని విమర్శించారు. కేసీఆర్ (BRS Chief KCR)కుటుంబం జైలుకు పోవడం ఖాయమన్నారు.
AP Election 2024: ఆ వార్తలు సాక్షిలో ఎలా వచ్చాయి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్
కేసీఆర్ కాళ్ళ దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళా తమ గురించి మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు. పదవుల కోసం కోట్లాడే వాళ్లం కాదన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ళు కండువాలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని కాదు తనను చూసి ఓటేశారని చెప్పారు. భువనగిరి పార్లమెంట్‌లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లేవన్నారు. ‘‘రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వ్యహరించారని.. వాళ్ళ శిష్యుడికి టిక్కెట్ ఇచ్చి నాకు ఇన్‌చార్జ్ ఇచ్చిండు.. కేసీఆర్‌కు మొగుడు అంటే రేవంత్ రెడ్డి అని నేను ఒప్పుకుంటున్నా’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. . ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీ కోసం ఇదే నా ఛాలెంజ్.. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చిన ఆ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు పక్కా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు గడ్డ మీద ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక వేదిక పైన చూస్తుంటే పండుగ వాతావరణం కనపడుతుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగుజాడల్లో తాను నడుస్తానని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు
YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..