Home » Nalgonda
Nalgonda News: రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు(Nalgonda Police) అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం, ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి, ఆగి ఉన్న లారీని ఢీ కొంది.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరోవైపు మేడారంకు వచ్చిన భక్తులు కూడా యాదగిరి గుట్టకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
Telangana: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రాజెక్ట్ ఫైట్ తారా స్థాయికి చేరుకుంది. ఓ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరగా.. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం నల్గొండకు బయలుదేరింది.
సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31 వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు.
నల్గొండ: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.
సూర్యాపేట: ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలని.. పాలన చేతకాక తన మీద కారు కూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశం నిర్వహించారు..