Home » Nampalli
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు.
మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో దాఖలు
నాంపల్లి ఎమ్మెల్మే మాజిద్ హుస్సేన్(Nampally MLM Majid Hussain), కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్(Congress leader Feroze Khan) మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారి అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Parankusham Venu: వేణు స్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా మూర్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.
నాంపల్లి రైల్వే స్టేషన్లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.