Share News

Hyderabad: రేవతి, తన్వీయాదవ్‌లకు బెయిల్‌ మంజూరు

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:05 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తిట్లతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కేసులో మహిళా జర్నలిస్టులు పి.రేవతి, తన్వీయాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Hyderabad: రేవతి, తన్వీయాదవ్‌లకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌, సైదాబాద్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తిట్లతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కేసులో మహిళా జర్నలిస్టులు పి.రేవతి, తన్వీయాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రేవతి తరఫున న్యాయవాది జి.కిరణ్‌ కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మహిళలు అయినందున రిమాండ్‌ రద్దు చేసి బెయిల్‌ మంజూరు చేయాలని వాదించారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే వీరు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని, బెయిల్‌ ఇవ్వద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు.


ఇరువురి వాదనల అనంతరం న్యాయమూర్తి అనూష బెయిల్‌ను మంజూరు చేశారు. కాగా, కేసులకు, బెదిరింపులకు భయపడబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ అన్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వీయాదవ్‌లను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు బనాయించి ఆడబిడ్డలను జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - Mar 18 , 2025 | 05:05 AM