Home » Nandyal
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు.
నంద్యాల జిల్లా: నందికొడ్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని రఘునాథ్ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు జరుగుతున్నాయి. రెండవరోజు ఆదివారం మహాదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
Andhrapradesh: నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న ముస్లిం యువతిని వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి అని - ముస్లింలపై జాతి అహంకారంతో జగన్ రెడ్డి అండ్ కో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానలను అధికారులు నిలిపివేశారు.
నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నుంచి ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఐదురోజులపాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారంతో మల్లన్న స్పర్శ దర్శనం ముగియనుంది. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమేనని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేుకుంటున్నారు.