‘విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించ వద్దు’
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:13 AM
విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించవద్దని, దాన్ని ఆపేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 1: విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించవద్దని, దాన్ని ఆపేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కడప స్టీల్‌ప్లాంట్ సెయిల్ ద్వారా ప్రారంభించాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలైన ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారివద్ద మంగళవారం నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎంఆర్ నాయక్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రఫి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శివ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వామపక్ష అనుబంధ సంస్థల నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.