Home » Nara Chandra Babu Naidu
పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్‌లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.
తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ.. 25 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ (YSRCP) ఓటమి గాలి వీస్తోందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి(జగన్) శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.
ట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.