Chandrababu: 160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే..!
ABN , Publish Date - May 03 , 2024 | 09:51 PM
ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ.. 25 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ (YSRCP) ఓటమి గాలి వీస్తోందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి(జగన్) శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు: ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ.. 25 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ (YSRCP) ఓటమి గాలి వీస్తోందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి(జగన్) శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీకి ఎవరూ అడ్డొంచిన తొక్కుకుంటూ పోవడమేనని చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం
వైసీపీకి డిపాజిట్లు రావు..
ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. బందిపోటుకు, ఐదు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని తెలిపారు. ఉద్యోగస్తులు వందకికు వంద శాతం కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అధికార వైసీపీ డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. తాము అడ్జస్ట్ అయ్యాం తప్పా.. ఒకరు తగ్గలేదు.. ఒకరు పెరగలేదని ఉద్ఘాటించారు. ఏపీ భవిష్యత్తు కోసం అడ్జస్ట్ అయ్యామని వివరించారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి రాష్ట్ర ప్రజలను ఆదుకుంటామని చంద్రబాబు మాటిచ్చారు.
Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!
మెరుగైన సంక్షేమం అందిస్తాం..
ఎన్డీఏ కూటమి పాలనలో మెరుగైన సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు తొలగించమని స్పష్టం చేశారు. జగన్ కంటే మెరుగైన పెన్షన్లు అందిస్తామని మాటిచ్చారు. 33 మంది పెన్షన్ దారులను జగన్ మోహన్ రెడ్డి చంపారని విమర్శించారు. చేతికి అందించాల్సిన పెన్షన్లను బ్యాంకుల్లో వేసి వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు పేర్కొన్నారు.
విద్యా సంస్థలతో ఒక బ్రాండ్ సంపాదించుకున్న వ్యక్తి నారాయణ అని కొనియాడారు. విలువలు, గౌరవం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికార పార్టీని నిలదీసి, ఎదిరించి బయటకు వచ్చిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వివరించారు. నెల్లూరు నగరానికి పూర్వ వైభవం రావాలంటే శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి, నారాయణాలను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..
Read Latest AP News And Telugu News