Home » Narendra Modi
మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరో.. ఒక రాజో కాదు. మాకు ఆయన దేవుడు.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
కోల్‌కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
గత 10 సంవత్సరాలలో ఫిన్‌టెక్ రంగంలో 31 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే ఫిన్‌టెక్ స్టార్టప్‌లు 500 శాతం పెరిగాయన్నారు. ఏంజెల్ పన్నును తొలగించడం కూడా ఈ రంగం అభివృద్ధికి ఒక ముందడుగు అని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో కరెన్సీ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.
భారత్‌కు మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటనపై కూడా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు మానవతా సహాయం, శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు. అయితే గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. దీనిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను సోమవారంనాడు విడుదల చేసిన బీజేపీ తొలి విడత ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉంటారు.
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.