Kolkata Doctor rape and murder: నా లేఖలు బదులివ్వలేదు.. మోదీకి మరో లేఖ రాసిన దీదీ
ABN , Publish Date - Aug 30 , 2024 | 03:43 PM
కోల్‌కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి (Mamata Banerjee) రెండో లేఖ రాశారు. అత్యాచార, అత్యాచార-హత్య ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితితో కేసులు పరిష్కరించేలా చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో కోరారు. ''అత్యంత సున్నితమైన ఈ అంశంపై ఆగస్టు 22న తాను రాసిన లేఖకు మీ నుంచి సమాధానం రాలేదు'' అని మోదీకి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అయితే, మహిళా సంక్షేమ శాఖ నుంచి సమాధానం వచ్చినప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సమాధానం సరిపోదని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రత్యేక POCSO కోర్టులను ఆమోదించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 88 ఫాస్ట్ ట్రాక్ట్ ప్రత్యే కోర్టులు, 62 పోక్సో కోర్టులు ఉన్నాయని, ఇవన్నీ పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తాయని మమత తన లేఖలో ప్రధాని దృష్టికి తెచ్చారు. ''కేసుల మానిటరింగ్, డిస్పోజల్ అనేది పూర్తిగా కోర్టుల చేతుల్లో ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రిటైర్డ్ జ్యూడిషయల్ అధికారులను మాత్రమే ఎఫ్‌టీఎస్‌సీలలో ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించాలి. అయితే, అయితే కేసుల సెక్యూరిటీ దృష్ట్యా శాశ్వత జ్యుడిషియల్ అధికారులు అవసరమని హైకోర్టు అభిప్రాయపడుతోంది. దీనిపై భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దృష్ట్యా మీరు చొరవ తీసుకోవడం తప్పనిసరి'' అని మమతా బెనర్జీ తన తాజా లేఖలో పేర్కొన్నారు.
West Bengal: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ కీలక భేటీ.. బెంగాల్‌పై నివేదిక
పశ్చిమబెంగాల్‌లో హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1098 సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని, దీనికి అదనంగా అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కూడా విస్తృతంగా వినియోగంలో ఉందని మమత ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార, అత్యాచార-హత్య ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితితో కేసులు పరిష్కరించేలా చట్టం ఉండాలని ప్రధానికి సూచించారు. సమాజ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.
Read More National News and Latest Telugu News