Home » NCP
మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కీలకమైన బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సునేత్ర పవార్‌పై ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సులే అధిక్యంలో కొనసాగుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.
రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సలో విలీనమవుతాయని లేదా ఆ పార్టీకి మరింత దగ్గరవుతాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందని, ఇంతకుమించి పవార్ ఎన్సీపీకి మరో మార్గం లేదని ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఏక్నాథ్ షిండే శివసేనలో చేరిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారంనాడు జోస్యం చెప్పారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.