Viral Video: మద్యం మత్తులో ఓ నేత కుమారుడి యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు..
ABN , Publish Date - Jul 18 , 2024 | 08:02 AM
మహారాష్ట్ర(maharashtra)లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూణెలోని మంజ్రీ ముంధ్వా రోడ్డులో కోళ్లతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది(accident). మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాజీ NCP కార్పొరేటర్ బందు గైక్వాడ్ కుమారుడు కావడం విశేషం.
మహారాష్ట్ర(maharashtra)లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూణెలోని మంజ్రీ ముంధ్వా రోడ్డులో కోళ్లతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది(accident). ఘటన అనంతరం కారు నడుపుతున్న సౌరభ్ గైక్వాడ్(Saurabh Gaikwad) మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆయన తండ్రి మాజీ NCP (శరద్ పవార్ వర్గం) కార్పొరేటర్ బందు గైక్వాడ్ కావడం విశేషం. ఈ ప్రమాదంలో కోళ్లను తీసుకెళ్తున్న టెంపో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం పూణేలోని కేశవనగర్‌లోని మంజ్రీ ముంద్వా రోడ్‌లోని జెడ్ కార్నర్ వద్ద జరిగింది.
కేసు నమోదు
సౌరభ్ గైక్వాడ్ SUV కారు నంబర్ MH 12 TH 0505లో ఉదయం ఐదు గంటలకు ముండ్వాలోని తన ఇంటికి వెళ్తున్నాడు. డ్రైవింగ్(driving) సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కోళ్ల ఫారానికి చెందిన టెంపోను ఢీ కొట్టాడు. ఈ ఘటన నేపథ్యంలో సౌరభ్ గైక్వాడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సౌరభ్ గైక్వాడ్ తండ్రి బందు గైక్వాడ్ ప్రస్తుతం శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో ఉన్నారు. ఇంతకు ముందు ఆ పార్టీ నుంచి మున్సిపల్ సేవకుడిగా పనిచేశారు. ఈ విషయమై హడప్‌సర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
విమర్శలు
అయితే అంత మార్నింగ్ సమయంలో కూడా సౌరభ్ గైక్వాడ్ మద్యం ఉండటం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించి అలా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేతల కుమారులు మద్యం సేవిస్తే ఇంట్లోనే ఉండాలని కోరుతున్నారు. బయటకు వచ్చి జనాలను ఇబ్బందులకు గురి చేయోద్దని సూచిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు(police) కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
గతంలో కూడా..
గతంలో పూణెలో రూ.2 కోట్ల విలువైన లగ్జరీ పోర్షే కారుతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఐటీ ఇంజనీర్లను ఓ ధనవంతుడు అర్ధరాత్రి ఢీ కొట్టి హత్య చేశాడు. మద్యం మత్తులో ఆ బిల్డర్ కొడుకు రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తన ఖరీదైన కారుతో చితక్కొట్టడంతో అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు.
మరోవైపు ఇటీవల నాగ్‌పూర్‌లోని నందనవన్ ప్రాంతంలో స్కోడా కారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న 5 మందిని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 5 మంది గాయపడ్డారు. గ్యారేజీలో పనిచేస్తున్న మైనర్ కారును పార్కింగ్ చేయకుండా రోడ్డుపై నడపడం ప్రారంభించాడు. ఆ క్రమంలో బ్రేక్‌కు బదులు అతని కాలు యాక్సిలేటర్‌పై పడటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న హ్యాండ్‌కార్ట్‌ను ఢీకొట్టింది.
ఇవి కూడా చదవండి:
NEET-UG: నీట్ యూజీ పేపర్ లీక్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. 23 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపు
Bengaluru: స్థానిక కోటాపై వెనక్కి!
Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత
For Latest News and National News click here