Home » NEET Paper Leak 2024
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిస్టమిక్ పేపర్ లీకేజీని నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన...
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీట్-యూజీ 2024 పరీక్షా పత్రంలో చర్చనీయాంశమైన ఫిజిక్స్ ప్రశ్నపై సరైన సమాధానం కోసం ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్‌కు సీజేఐ డైవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ(NEET UG 2024)లో పేపర్ లీక్, ఇతర అవకతవకలపై దాఖలైన 40కి పైగా పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్(Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కూడా ఈ అంశంపై విచారించి నేటికి వాయిదా వేసింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శనివారం నీట్ యూజీ 2024(NEET-UG 2024) ఫలితాలను విడుదల చేసింది. ఈ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET Paper Leak)పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో గురువారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పేపర్ లీకేజ్‌పై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2024కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) నేడు (జూలై 18) విచారించనుంది. జూలై 18న సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కారణాల జాబితా ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 40కి పైగా పిటిషన్‌లను విచారించనుంది.