Share News

Delhi : నీట్‌లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:05 AM

నీట్‌ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్‌ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది.

Delhi : నీట్‌లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ

  • ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

  • కమిటీ వెయ్యండి..

నీట్‌ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్‌ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. వారు గుర్తించిన సమాధానాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. నీట్‌కు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపి.. దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. దీనికి ముందు.. నీట్‌ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. పేపర్‌ లీకేజీ పెద్ద ఎత్తున జరిగిందనడానికి ఆధారాలు ఉంటే సమర్పించాలని పిటిషనర్లను కోరింది. లీకేజీ విస్తృత స్థాయిలో జరిగిందనడానికి ఆధారాల్లేవని వ్యాఖ్యానించింది. నీట్‌పై మంగళవారం కూడా విచారణ జరగనుంది.

Updated Date - Jul 23 , 2024 | 05:06 AM