Home » New Delhi
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో వడగాల్పలు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగి అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్‌ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణం విభాగం మంగళవారం వెల్లడించింది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నేతలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం జరుపనున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది.
ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఒక కుటుంబానికి ఊహించని దు:ఖాన్ని కలిగించింది. ఓ యువతి తల్లిదండ్రులను భోరున విలపించేలా చేసింది. కన్నతల్లి సొమ్మసిల్లి పడిపోగా.. తండ్రి నిస్సహా స్థితికి జారుకున్నాడు.
దేశ రాజధాని న్యూడిల్లీలో రోజు రోజుకు మంచి నీటి ఎద్దడి తీవ్ర తరమవుతుంది. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆప్ ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకుంటుంది.
బస్సు ప్రయాణం, రైలు ప్రయాణమన్న తర్వాత ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎవరో ఒక్కరికి అసౌకర్యం కలుగుతుంటుంది. రూ.10లు, రూ. 100లు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆ యా ప్రయాణికులు సర్థుకు పోతుంటారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.
కొత్త క్రిమినల్ చట్టాలైన 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారంనాడు తెలిపారు.
ఢిల్లీ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై 'అనర్హత' వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారంనాడు తెలిపారు. 'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖతో సహా పలు శాఖలను ఆనంద్ గతంలో నిర్వహించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్ సురేఖ యాదవ్‌ను ఆహ్వానం అందింది.